SBI Personal Loan: ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:51 AM
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులకు కేవలం రూ.90 పైసల వడ్డీతో పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల వరకూ రుణం లభిస్తుంది. అంతేకాదు, అదనంగా రూ.50 లక్షల బీమా కూడా అందుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రారంభించింది. అగ్నిపథ్ పథకం కింద భారత సైన్యంలో నియమితులైన స్త్రీ, పురుషుల కోసం SBI ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. అగ్నివీర్స్‌కు బహుమతిని అందించిన ఈ పథకం కింద కేవలం రూ.90 పైసల వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా, ప్రాసెసింగ్ రుసుమును కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, ఈ పథకం కింద లోన్ తీసుకున్నవారికి రూ.50 లక్షల వరకూ బీమా సైతం లభిస్తుంది. ఇంతకీ, ఈ రుణం ఎలా పొందాలంటే..
ఎస్‌బీఐ అగ్నివీర్ యోజన లోన్ పథకం కింద, SBIలో జీతం ఖాతా ఉన్న అగ్నివీర్ సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని సులభంగా పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ప్లస్ అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయని ప్రకటించింది. దేశరక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్న సైనికులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
SBIలో శాలరీ అకౌంట్స్ ఖాతాలు కలిగి ఉన్న అగ్నివీర్ సిబ్బందికి ఈ ప్రత్యేక పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా అగ్నివీర్ సిబ్బందికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 4 లక్షల వరకు రుణం అందుతుంది. అంతేకాకుండా, ప్రాసెసింగ్ రుసుము పూర్తిగా మాఫీ చేస్తారు. తిరిగి చెల్లించే కాలం 'అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్' మాదిరిగానే ఉంటుంది.ఈ పథకం కింద, SBI అగ్నివీర్ సెప్టెంబర్ 30, 2025 వరకు కేవలం 10.50 శాతం స్థిర వడ్డీ రేటుతో సిబ్బందికి వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.
SBI రక్షణ శాఖ జీతభత్యాల ఆధారంగా ఈ పథకం కింద రుణాలు అందిస్తోంది. దీని ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న SBI ATMలలో 'రక్షణ సిబ్బంది'కి జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, అపరిమిత ఉచిత ATM లావాదేవీలు, డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలు మాఫీ అవుతున్నాయి. వీటితో పాటు, ఇది రూ. 50 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ. 1 కోటి విమాన ప్రమాద బీమా, రూ. 50 లక్షల వరకు శాశ్వత వైకల్య కవర్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది.
ఇవీ చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..