Share News

Magellanic Cloud: మాజిల్లానిక్‌ క్లౌడ్‌ భారీ విస్తరణ ప్రణాళిక.. రూ. 400 కోట్లు, 3,500 నియామకాలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:41 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ సేవల సంస్థ మాజిల్లానిక్‌ క్లౌడ్‌ భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుమారు రూ.400 కోట్లతో కంపెనీల...

Magellanic Cloud: మాజిల్లానిక్‌ క్లౌడ్‌ భారీ విస్తరణ ప్రణాళిక.. రూ. 400 కోట్లు, 3,500 నియామకాలు

  • మాజిల్లానిక్‌ క్లౌడ్‌ ఎండీ జోసెఫ్‌ సుధీర్‌

  • రెండేళ్లలో 3,500 నియామకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ సేవల సంస్థ మాజిల్లానిక్‌ క్లౌడ్‌ భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుమారు రూ.400 కోట్లతో కంపెనీల కొనుగోళ్లు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సంస్థ ఎండీ, గ్లోబల్‌ సీఈఓ జోసెఫ్‌ సుధీర్‌ తుమ్మా సోమవారం నాడిక్కడ తెలిపారు. ఐటీ, డ్రోన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డెవ్‌ఆప్స్‌, ఈ-సర్వియలెన్స్‌ వంటి విభాగాల్లో ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్‌-మే నెల నాటికల్లా అమెరికాలో రూ.200 కోట్లతో ఒక కంపెనీని కొనుగోలు చేయనుండగా జూలై నాటికి మరో రూ.150 కోట్లతో మరో కొనుగోలును చేపట్టనున్నట్లు సుధీర్‌ తెలిపారు. వీటితో పాటు మిగిలిన మొత్తంతో మరో నాలుగైదు చిన్న కంపెనీలను చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం కంపెనీకి చెందిన అన్ని విభాగాల్లో దాదాపు 1,600 మంది ఉద్యోగులు ఉన్నారని, వచ్చే రెండేళ్లలో కొత్తగా 3,500 నియామకాలు చేపట్టటం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,000కు చేరుకోనుందని సుధీర్‌ వెల్లడించారు. కాగా కంపెనీ అనుబంధ సంస్థ స్కాన్‌డ్రోన్‌...ఈ మధ్యనే కార్గోమ్యాక్స్‌ 200కేహెచ్‌సీ డ్రోన్‌ను ఆవిష్కరించిందని సుధీర్‌ తెలిపారు. ఈ డ్రోన్‌ 200 కిలోల వరకు పేలోడ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు.



Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 07:47 AM