PAN-Aadhaar Linking Deadline: డిసెంబర్ వరకే గడువు.. పాన్ కార్డును ఆధార్ తో ఇలా లింక్ చేయండి!
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:36 PM
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
బిజినెస్ న్యూస్: నేటికాలంలో పాన్ కార్డు గురించి తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి.. పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ముఖ్యంగా పన్నులు దాఖలు చేసే సమయంలో , బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం మ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు అస్తవ్యస్తం చేయవచ్చు. అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి.
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే విధానం:
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్(https://www.incometax.gov.in/iec/foportal/) కు వెళ్లండి.
హోమ్‌పేజీ దిగువన ఎడమవైపున ఉన్న 'లింక్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
'ధృవీకరించు' బటన్ పై క్లిక్ చేయండి.
పాన్-ఆధార్ లింక్ అభ్యర్థన UIDAIకి ధ్రువీకరణ కోసం ఫార్వార్డ్ అవుతుంది.
అన్ని వివరాలను సమర్పించండి.
పోర్టల్ మీ అభ్యర్థనను అంగీకరిస్తుంది. లింకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అవసరమైతే, పేజీ OTP ద్వారా ధ్రువీకరణ కోసం మీ పేరు లేదా ఫోన్ నంబర్‌ను అడగవచ్చు.
మీ ఆధార్ కార్డ్ ప్రకారం ఇన్‌పుట్‌లను నమోదు చేసి.. 'సబ్మిట్'పై క్లిక్ చేయండి.
ఆధార్-పాన్ లింక్ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి 4-5 రోజులు పట్టవచ్చు.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి