Prada Luxury Safety Pins: ఈ సేప్టీ పిన్స్ ధర రూ.68 వేలు! ప్రత్యేకత ఏంటంటే..
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:54 PM
మహిళల బ్యాగుల్లో సేప్టీ పిన్స్ తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి కనిపించకపోయినా.. వెంటనే కొనుగోలు చేస్తుంటారు. వీటి ధర రూ. 10 నుంచి 20 వరకు ఉంటుంది. అయితే
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మహిళలు, యువతులు తమ అలంకరణలో అనేక రకాల వస్తువులు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా డ్రెసులు ధరించే క్రమంలో సేఫ్టీ పిన్స్(Safety Pin) ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందుకే మహిళల బ్యాగుల్లో ఈ పిన్స్ తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి కనిపించకపోయినా.. వెంటనే కొనుగోలు చేస్తుంటారు. వీటి ధర రూ. 10 నుంచి 20 వరకు ఉంటుంది. అయితే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ రకమైన సేప్టీ పిన్స్(Safety Pin) ధర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీటి ధర రూ. 68 వేల పైమాటే. మరి.. దీని ప్రత్యేకత ఏమిటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రాడా బ్రాండ్(Prada Brand) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది స్టైలిష్ సామాన్లు, ఉపకరణాలు, లగ్జరీ వస్తువులకు ప్రసిద్ధి చెందింది. తరచూ ఏదో ఒక అంశంతో ప్రాడా బ్రాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సేఫ్టీ పిన్స్ ఖరీదు ఈ కంపెనీని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రాడా బ్రాండ్ కు చెందిన ఈ సేప్టీ పిన్స్(Expensive Safety Pins) ధర 775 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.68,700)గా ఉంది. ఈ ధర చాలా మందిని షాక్ కి గురి చేసింది. సాధారణ సేఫ్టీ పిన్నుల ధరను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ధర చాలా ఎక్కువగా ఉంది.
అయితే ఈ పిన్స్ గోల్డ్ మెటల్‌తో తయారు చేస్తారు కాబట్టే అంత ధర ఉందన సమాచారం. ఈ లగ్జరీ సేఫ్టీ పిన్స్ కొనడానికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ గోల్డ్ సెప్టీ పిన్(Prada Gold Brooch,)లను 'సొగసైన మెటల్ భద్రతా పిన్ బ్రూచ్'గా ప్రాడా విక్రయిస్తోంది. ఈ లగ్జరీ సేప్టీ పిన్స్ లేత నీలం, గులాబీ నారింజ అనే మూడు రంగులలో లభిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. దీని ధర ఎంతో మంది యువకుల నెలజీతంతో సమానమని, ఇంత ఖరీదు అయితే ఎలా కొంటారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సేప్టీ పిన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో(Social Media) తెగ వైరల్ అవుతోంది. మీరు ఖరీదైన ఈ సేప్టీ పినులపై ఓ లుక్కేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి