Mexican President: మెక్సికో ప్రెసిడెంట్‌కు లైంగిక వేధింపులు.. పబ్లిక్‌లో ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:37 PM
మెక్సికో అధ్యక్షురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పట్టపగలు, బహిరంగ ప్రదేశంలో వందల మంది మధ్యలో ఉండగా ఒక వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెక్సికో అధ్యక్షురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పట్టపగలు, బహిరంగ ప్రదేశంలో వందల మంది మధ్యలో ఉండగా ఒక వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధ్యక్షురాలి విషయంలో భద్రతా సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలపాలవుతోంది (Mexican President).
మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ (Claudia Sheinbaum) మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. రోడ్డు మీద ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన క్లాడియా అతడిని వెనక్కి నెట్టేశారు. అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడే భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వారు వెంటనే స్పందించడంలో విఫలమయ్యారు (presidential security).
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (public incident). దేశాధ్యక్షురాలికే భద్రత లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాధ్యక్షురాలికి ఆ వ్యక్తి అంత దగ్గరగా వస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని చాలా మంది ప్రశ్నించారు. ఇది పూర్తిగా భద్రతా సిబ్బంది వైఫల్యమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై అధ్యక్షురాలి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌నకు ఝలక్.. న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక
వర్జీనియా లెఫ్టెనెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ ఎన్నిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి