Woman Harassment To Boy: 38 ఏళ్ల మహిళతో 19 ఏళ్ల యువకుడి ఎఫైర్.. ఊహించని విధంగా..
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:29 PM
38 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం కారణంగా 19 ఏళ్ల యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు. మహిళ వేధింపులు భరించలేక ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
38 ఏళ్ల మహిళతో ఎఫైర్ 19 ఏళ్ల యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. మహిళ వేధింపులు తాళలేక ఆ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చింతామణి తాలూకాలోని మూడచింతలహళ్లి గ్రామానికి చెందిన 38 ఏళ్ల శారద భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
తన ఇద్దరు పిల్లలతో మూడచింతలహళ్లిలో నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల నిఖిల్ అనే యువకుడితో శారదకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తరచుగా ఇద్దరూ ఏకాంతంగా కలిసే వారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా గ్రామంలోని అందరికీ తెలిసిపోయింది. తల్లిదండ్రులు హెచ్చరించటంతో నిఖిల్.. శారదకు దూరంగా ఉంటున్నాడు. శారద మాత్రం తన తల్లిదండ్రుల మాటలు లెక్కచేయలేదు.
ఏకాంతంగా కలవాలంటూ నిఖిల్‌ను వేధించసాగింది. గత కొద్దిరోజుల నుంచి ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. నిఖిల్ ఆ వేధింపులు తట్టుకోలేకపోయాడు. ప్రాణాలు తీసుకుందామని నిశ్చయించుకున్నాడు. కాచేహళ్లి సరస్సు దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిఖిల్ తల్లిదండ్రులు శారదపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు శారదపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఇలాంటి జుగాద్ ఎప్పుడూ చూసుండరు.. కదిలే మంచం..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో కనిపెట్టండి..