Share News

Unbelievable Indian Jugaad: ఇలాంటి జుగాద్ ఎప్పుడూ చూసుండరు.. కదిలే మంచం..

ABN , Publish Date - Nov 05 , 2025 | 02:43 PM

ఆ దివ్యాంగుడు మంచంపై పడుకుని బైకును నడపసాగాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దివ్యాంగుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళుతున్న వారు ఎంతో ఆశ్చర్యంగా ఆ మంచం బైకును చూస్తూ ఉన్నారు.

Unbelievable Indian Jugaad: ఇలాంటి జుగాద్ ఎప్పుడూ చూసుండరు.. కదిలే మంచం..
Unbelievable Indian Jugaad

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతీ మనిషి ఓ మీడియా సంస్థగా మారిపోయాడు. తన చుట్టూ జరిగే వాటిని సోషల్ మీడియా వేదికగా తోటి జనాలతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కువ మంది కొత్తగా, వింతగా ఏది కనిపించినా వెంటనే ఫోన్‌లో వీడియోలు తీసేస్తున్నారు. వాటిని సోషల్ మీడియా వేదికగా ఇతరులతో పంచుకుంటూ ఉన్నారు. వాటిలో కొన్ని వైరల్‌గా కూడా మారుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూడా అలాంటిదే.


మనీష్ శర్మ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు లక్షకుపైగా మంది ఆ వీడియోను చూశారు. 45 వేల మంది లైక్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బిహార్‌కు చెందిన ఓ దివ్యాంగుడు తను ప్రయాణించడానికి వీలుగా ఉండేలా బైకుపై మంచాన్ని తగిలించుకున్నాడు. మంచానికి అటు వైపు, ఇటు వైపు రిక్షా చక్రాలను అమర్చాడు.


ఇక, ఆ మంచంపై పడుకుని బైకును నడపసాగాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దివ్యాంగుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళుతున్న వారు ఎంతో ఆశ్చర్యంగా ఆ మంచం బైకును చూస్తూ ఉన్నారు. ఇక, వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కదిలే బెడ్ రూమ్’.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు.. స్లీప్ అండ్ డ్రైవ్’..‘మంచాన్ని ఇలా కూడా వాడొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది’ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో దారుణం.. చట్నీ పడిందని.. చంపేశారు..

రాష్ట్రం నుంచి జగన్‌ను తరిమికొట్టాలి..

Updated Date - Nov 05 , 2025 | 02:47 PM