Share News

Job Shortage: 2030 నాటికి ఈ దేశాల్లో 5 కోట్లకుపైగా ఉద్యోగాల కొరత..

ABN , Publish Date - May 09 , 2025 | 09:08 PM

ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు వలన కార్మిక కొరత భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో 2030 నాటికి పలు దేశాల్లో 5 కోట్ల ఉద్యోగాలు కొరత ఉందని ఓ నివేదిక తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Job Shortage: 2030 నాటికి ఈ దేశాల్లో 5 కోట్లకుపైగా ఉద్యోగాల కొరత..
Job Shortage 2030

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కీలక దేశాలైన జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశాల్లో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా కార్మికుల కొరత ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ శ్రామిక రంగానికి ఎదురయ్యే పెద్ద సవాలని వెల్లడించింది. ఈ క్రమంలో మానవ వనరుల కొరత పలు పరిశ్రమల వృద్ధికి అడ్డుపడుతుందని చెప్పింది. గ్లోబల్ యాక్సెస్ టు టాలెంట్ ఫ్రమ్ ఇండియా (GATI) ఫౌండేషన్ ప్రారంభోత్సవ సమయంలో విడుదలైన నివేదిక ఈ మేరకు తెలిపింది.


వచ్చే రెండు దశాబ్దాలలో

రాబోయే రెండు దశాబ్దాలలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని రిపోర్ట్ హెచ్చరించింది. ఈ సవాల్‌ను అవగాహన చేసుకుని, యువత ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలు గ్లోబల్ టాలెంట్ సరఫరా కేంద్రాలుగా మారేందుకు ఛాన్స్ ఉందని గుర్తు చేసింది. ఇదే సమయంలో భారత్‌కు కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలో విపరీతమైన డిమాండ్-సప్లై లోపాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో Global Access to Talent from India (GATI) అనే కొత్త ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీని లక్ష్యం భారత యువతను సరైన శిక్షణతో, చట్టబద్ధమైన మార్గంలో విదేశీ ఉద్యోగ మార్కెట్లకు పంపించడం ద్వారా అంతర్జాతీయ కార్మిక అవసరాలను తీర్చడమే.


అంచనాలు & గణాంకాలు

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) సీనియర్ పార్టనర్ రాజీవ్ గుప్తా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం ఈ కార్మిక కొరత 11–12% వేగంతో ప్రతి ఏటా పెరుగుతోంది. తద్వారా వచ్చే 25 సంవత్సరాల్లో ఇది 250 మిలియన్లకి పెరిగే ప్రమాదం ఉంది. మొత్తం 20 దేశాల్లో 90% వరకూ ఈ గ్యాప్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రధాన దేశాల్లో అంచనా వేసిన ఉద్యోగ కొరత అమెరికాలో 11–12 మిలియన్లు ఉండగా, యూకేలో 5–6 మిలియన్లుగా ఉంది. దక్షిణ కొరియా, పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో 4–5 మిలియన్లుగా అంచనా వేశారు.


విదేశాలకు వెళ్లే ఛాన్స్

మరోవైపు జర్మనీ, రష్యా వంటి ప్రాంతాల్లో 3–4 మిలియన్లు ఉండగా, జపాన్‎లో 2–3 మిలియన్లు, కెనడా, గల్ఫ్ దేశాలు, తైవాన్, ఆస్ట్రేలియా, ఇటలీలో 1 నుంచి 2 మిలియన్ల వరకు ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో సింగపూర్, రొమేనియా, బల్గేరియా ప్రాంతాల్లో సున్నా నుంచి ఒక మిలియన్ వరకు ఉండవచ్చని రిపోర్ట్ వెల్లడించింది.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా కార్మిక కొరత సమస్య ఉందని గతి నిపుణులు అన్నారు. దీనికి భారతదేశం ఒక పరిష్కార మార్గం కావచ్చని వెల్లడించారు. సరైన విధంగా అమలు చేస్తే, ప్రతి సంవత్సరం 700,000 నుంచి 2.5 మిలియన్ వరకు భారతీయులు విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉందన్నారు. దీంతో భారత జీడీపీకి $300 బిలియన్ వరకు రిమిటెన్సుల రూపంలో వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన


India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు


Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 09:19 PM