Best Investment Rs 1 Lakh: బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఈక్విటీ.. లక్ష పెట్టుబడి దేనిలో ఎక్కువ
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:15 PM
మనం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, మూడు ముఖ్యమైన ఆప్షన్లు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. షేర్ మార్కెట్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్. అయితే వీటిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దేనిలో ఎక్కువ వస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మనం డబ్బు పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, అనేక మందికి ఎక్కువగా మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఈక్విటీ (షేర్ మార్కెట్), బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటాయి. అయితే వీటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది? గత 10 ఏళ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే దేనిలో ఎక్కువ వచ్చిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పటికీ మెరిసే ఆస్తి
మన దేశంలో బంగారం అంటే ఒక భావోద్వేగం. పెళ్లిళ్లు, పండగలు, లేదా పెట్టుబడి కోసం... బంగారం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. గత 10 ఏళ్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తేనే అర్థమవుతుంది.
ఉదాహరణకు అదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఫండ్ (డైరెక్ట్ ప్లాన్) గోల్డ్ ETF గత 10 ఏళ్లలో సంవత్సరానికి 13.46% రాబడిని ఇచ్చింది. అంటే, 2015లో మీరు రూ.1 లక్ష పెట్టి ఉంటే, 2025 ఆగస్టు 26 నాటికి అది రూ.3,53,531 అయి ఉండేది. అది కూడా బంగారం ఆభరణాలు కొనకుండా, ETF రూపంలో. ఇది సురక్షితమైన, సులభమైన పెట్టుబడి మార్గం.
రిస్క్ తీసుకుంటే రిటర్న్స్ కూడా
ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మీకు రిస్క్ తీసుకోవడం ఇష్టమైతే, ఈక్విటీ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నిఫ్టీ 50 TRI ఇండెక్స్ (డివిడెండ్లను కూడా లెక్కలోకి తీసుకునే బెంచ్‌మార్క్) గత 10 ఏళ్లలో సంవత్సరానికి 13.62% రాబడిని ఇచ్చింది.
2015లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, 2025 ఆగస్టు నాటికి అది రూ.3,58,548 అయి ఉండేది. ఇది బంగారం కంటే కొంచెం ఎక్కువ. కానీ, ఈక్విటీలో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులు, ఆర్థిక పరిస్థితులు దీన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఈక్విటిలు మంచి రాబడిని ఇచ్చాయని చరిత్ర చెబుతోంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్
ఇప్పుడు మనం మన బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) గురించి మాట్లాడుకుందాం. FD అంటే సురక్షితమైన పెట్టుబడి. రిస్క్ లేదు, హామీ ఇచ్చిన రాబడి వస్తుంది. 2015లో SBI 10 ఏళ్ల FD వడ్డీ రేటు 8.25% ఉండేది. దీనిలో రూ.1 లక్ష పెట్టి ఉంటే, 2025 నాటికి అది రూ.2,26,281 అయి ఉండేది. ఈక్విటీ, బంగారంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ, FDలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
గమనిక: ఆంధ్రజ్యోతి పెట్టుబడులు చేయాలని సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి