Deputy Speaker Raghurama: పవన్ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:29 PM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు.
అమరావతి: కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన వైసీపీ సపోర్టర్ ఫేక్ పోస్టులను పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల అధికార కూటమిలో వైషమ్యాలు తీసుకురావడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..
తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్‌లను సైతం ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ అంశంపై తక్షణం విచారణకు ఆదేశించి ఈ ఫేక్ పోస్టుల మూలలను శోదించాలని, భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్