Share News

PM Palem Case: విశాఖ పీఎం పాలెం మహిళా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:34 AM

పీఎం పాలెంలో మహిళా కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఒకే కేసులో నిందితులు బాధితులుగా.. బాధితులు నిందితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కిడ్నాప్‌తో పాటు నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకి వచ్చింది.

PM Palem Case: విశాఖ పీఎం పాలెం మహిళా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
PM Palem Case

విశాఖపట్నం, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పీఎం పాలెంలో మహిళా కిడ్నాప్ కేసు (Kidnap Case)ను గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఒకే కేసులో నిందితులు బాధితులుగా.. బాధితులు నిందితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కిడ్నాప్‌తో పాటు నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కిడ్నాప్ కేసుతో అసలు బాగోతం బయటపడింది. 2018లో డ్వాక్రా సంఘం లీడర్‌ ప్రమీల లోన్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు పవన్, శేఖర్‌ నుంచి డబ్బులు సేకరించారు. చాలామంది నుంచి అప్పుల రూపంలో డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.


ఈ క్రమంలో పవన్, శేఖర్‌లతో డ్వాక్రా సంఘం లీడర్‌ ప్రమీల 2018లో రూ.15 లక్షలని లోన్స్ కోసం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని వారు అడిగారు. అయితే పవన్, శేఖర్‌లకి నగదు ఇవ్వకుండా ప్రమీల తప్పించుకు తిరుగుతున్నారు. పీఎం పాలెం అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉంటుందని వారు తెలుసుకొన్నారు. ఈ క్రమంలో అమెను బలవంతంగా కారు ఎక్కించి శేఖర్, పవన్ గోపాలపట్నం తీసుకెళ్లారు. అక్కడ ఆమెను డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఈ నేపథ్యంలో ప్రమీలపై భౌతికంగా దాడికి దిగారు శేఖర్, పవన్.


ఈ క్రమంలో శేఖర్, పవన్ నుంచి తప్పించుకుని పోలీసులను ఆమె ఆశ్రయించారు. ప్రమీల తమను మోసం చేసిందని శేఖర్, పవన్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు తనిఖీ చేశారు. చిన్న పిల్లలు ఆడుకునే డమ్మీ కరెన్సీ రూ. 30 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మహిళను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడటంతో పవన్, శేఖర్‌లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పీఎం పాలెం పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..

ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 10:48 AM