Kommareddy Pattabhiram: వైద్య విద్యలో పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యం..
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:33 PM
వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు.
అమరావతి: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లి గోడలు, ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు చూసి వచ్చారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. వాటిని చూసి ఆహా.. ఓహో.. అంటూ ప్రజల్ని మోసం చేసే విధంగా డ్రామాలు ఆడారని ఆరోపించారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్‌కి అమ్మేయడం కాదు.. పనుల్లో ప్రైవేట్ సహకారం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీల నియంత్రణ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాగే.. పేద విద్యార్థులకు అదే కేటాగిరి కింద రూ.15 వేల కేటాయించబడతాయని చెప్పారు. పీపీపీ పద్ధతిని నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ సేట్ సమర్థించారని గుర్తు చేశారు. వైద్య విద్యను ముందుకు తీసుకువెళ్లాలంటే పీపీపీ సరైన దారి అని ఎన్ఎంసీ స్పష్టం చేసిందని వెల్లడించారు.
పీపీపీ కాలేజీల ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మెడికల్ చదివే అవకాశం కలుగుతోందని పట్టాభిరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీవో నెం.108 విడుదల చేసింది జగన్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. అదే జీవోను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ జీవో ప్రకారమే జరుగుతున్న పనుల్ని వైసీపీ నేతలు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..