Share News

Minister Nara Lokesh: రాజకీయాల్లోకి వచ్చాక మార్పు వచ్చింది.. లోకేశ్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:57 PM

ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. విద్యాశాఖ కావాలని చెప్పినట్లు లోకేశ్ పేర్కొన్నారు. యూనియన్‌‌లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని అన్నారని.. అయినా అదే శాఖ కావాలని కోరినట్లు చెప్పారు.

Minister Nara Lokesh: రాజకీయాల్లోకి వచ్చాక మార్పు వచ్చింది.. లోకేశ్ కీలక వ్యాఖ్యలు..
Minister Nara Lokesh

అమరావతి: మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ సభలో ప్రసంగించారు. 150 రోజల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయడం ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి 3 తరాలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చాక తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు మంత్రి లోకేశ్. గతంలో తనని ఎక్కడ పోటీ చేస్తావని చంద్రబాబు అడిగారని.. మంగళగిరి అని చెప్పి చివరకు ఓడిపోయా అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన చాలా అవమానపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజల్లో కసితీరా పనిచేసి తిరిగి అక్కడే గెలిచానని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.


ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. విద్యాశాఖ కావాలని చెప్పినట్లు లోకేశ్ పేర్కొన్నారు. యూనియన్‌‌లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని అన్నారని.. అయినా అదే శాఖ కావాలని కోరినట్లు చెప్పారు. ఉత్తమ ఉపాద్యాయులను ఫిన్ ల్యాండ్, సింగపూర్ వంటి దేశాలకు అధ్యాయనానికి పంపాలని ఈ సందర్భంగా లోకేశ్ సూచించారు.

అప్పుడు వారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చనే కోరిక విద్యార్థులతో పాటు అందరికీ ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికైనట్లు తెలిపారు. టీచర్లుగా నియమితులైన వాళ్లల్లో 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పురుషులతో సమానంగా దాదాపు 50 శాతం మంది మహిళలు ఎంపిక కావడం ఈ మెగా డీఎస్సీ విశిష్టత అని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.


Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

Updated Date - Sep 25 , 2025 | 06:09 PM