Mohith Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి షాక్.. పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:19 PM
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ఆరోపణలు ఉన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఈ మేరకు మోహిత్ రెడ్డి పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఇవాళ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ఆరోపణలు ఉన్నాయి. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని, దర్యాప్తుకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని మోహిత్‌రెడ్డి తెలిపారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టను ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టి న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..