Chandrababu Vision 2047: ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:04 PM
ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ను 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని... 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడానికి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ను 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని... 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్య సమస్యతో కుటుంబం మొత్తం మీద భారం పడుతుందని.. అందుకోసం ప్రతి కుటుంబానికీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకు వస్తున్నామన్నారు. ఆడబిడ్డలు ఆరోగ్యం కోసం ఈ మెడికల్ క్యాంప్ ప్రారంభించామన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ కోసం పని చేస్తున్నామన్నారు. విశాఖ ప్రజలు మంచి మనషుల్నారు చంద్రబాబు. వైజాగ్ సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని.. దేశంలో మంచి సిటీగా మారుతుందని పేర్కొన్నారు.
మహిళలు ప్రతి రోజు ఒక అర గంట .. మన కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆయిల్, షుగర్, ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ఆరోగ్యం కోసం రూ.20వేల కోట్ల ఖర్చు పెడుతున్నామని.. అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు పెరుగుతోందన్నారు. బిల్గేట్ ఫౌండేషన్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో సంజీవని కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Read Latest AP News And Telugu News