APL Season-4: క్యాపిటల్ అమరావతి రాయల్స్ ఘన విజయం..
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:38 PM
మూడు వికెట్ల తేడాతో భీమవరం బుల్స్‌పై క్యాపిటల్ అమరావతి రాయల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
విశాఖ: ఏపీఎల్ సీజన్ -4, 8వ మ్యాచ్‌లో భీమవరం బుల్స్ , క్యాపిటల్ అమరావతి రాయల్స్ తలపడ్డాయి. హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో భీమవరం బుల్స్‌కి బ్రేక్ వేసి అమరావతి రాయల్స్ హ్యాట్రిక్ విన్ అందుకుంది. ఈ విజయంతో మూడు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆరు పాయింట్లతో మిగిలిన టీమ్స్ కంటే అమరావతి రాయల్స్ ముందంజలో కొనసాగుతుంది.
మూడు వికెట్ల తేడాతో భీమవరం బుల్స్‌పై క్యాపిటల్ అమరావతి రాయల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అమరావతి రాయల్స్ రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు కొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటర్స్ ఎస్.వి.రాహుల్, బండారు అయ్యప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడి అమరావతికి గెలుపు ఖారారు చేశారు. ఎస్.వి.రాహుల్ 25 బంతుల్లో మూడు పోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. బండారు అయ్యప్ప 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు.
అలాగే తొలత బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ టీమ్‌లో ఇద్దరు బ్యాటర్స్ హాఫ్ సెంచరీ చేశారు. నిమ్మల హిమకర్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు కొట్టాడు. కె.రెవంత్ రెడ్డి 50 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు కొట్టి చెరో హాఫ్ సెంచరీ వారి ఖాతాలో వేసుకున్నారు. అమరావతి రాయల్స్ నుంచి ఎస్.వి.రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు