Share News

AP Rain Alert: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:44 PM

కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటువంటి ఆవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడురోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించారు.

AP Rain Alert: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళఖాతం, ఉత్తరకోస్తా, దక్షిణకోస్తాపైన ఉపరితల ఆవర్తనం కోనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాజిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడేటువంటి ఆవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలో గుంటూరు, బాపట్ల, కృష్ట, పల్నాడులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అటు రాయలసీమలో కూడ అక్కడికక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని స్పష్టం చేశారు.


హెచ్చరికలు జారీ..

కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటువంటి ఆవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడురోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని చెప్పుకొచ్చారు. అలాగే సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయన్నారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.


రాబోయే 24 గంటల్లో..

కాగా, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లో అలెర్ట్ ప్రకటించిన జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Updated Date - Sep 10 , 2025 | 04:50 PM