Share News

Tirumala: తిరుమలకా తర్వాత వెళ్దాం

ABN , Publish Date - May 12 , 2025 | 02:31 AM

యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది

Tirumala: తిరుమలకా తర్వాత వెళ్దాం

  • యుద్ధ భయంతో పర్యటన వాయిదా వేసుకుంటున్న భక్తులు?

  • వేసవిలోనూ కానరాని రద్దీ

  • ఆదివారం సాయంత్రం ఆలయం ముందు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ

తిరుమల, మే 11(ఆంధ్రజ్యోతి): భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వేసవిలోనూ క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో, ప్రత్యేకించి పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే మొక్కులు తీర్చుకునే భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. దర్శనానికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతోపాటు క్యూలైన్లు కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.


ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి పహల్గాం ఉగ్రదాడి, యుద్ధమే కారణమని టీటీడీ అభిప్రాయపడుతోంది. గతేడాది ఎన్నికలున్న క్రమంలో ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుమల అత్యంత రద్దీతో కూడుకున్న ప్రదేశం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితి చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలో 1, 2 తేదీలు మినహా ఏ రోజూ కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 02:31 AM