Operation Sindoor: భారత్-పాక్ యుద్ధం.. ఢిల్లీకి తెలుగు స్టూడెంట్స్
ABN , Publish Date - May 10 , 2025 | 01:14 PM
Operation Sindoor: భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు. పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలోనే దాదాపు 2వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ, మే 10: భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ జమ్ముకాశ్మీర్, పంజాబ్ నుంచి పలువురు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు దేశరాజధానికి వచ్చేశారు. నిన్న (శుక్రవారం) రాత్రి పంజాబ్‌లో బ్లాక్ ఔట్ ఇచ్చారు. యూనివర్సిటీలను టార్గెట్ చేసినట్టు అనుమానం రావడంతో.. వెంటనే వెళ్లిపోవాలని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలుగు విద్యార్థులను ప్రభుత్వాలు ఢిల్లీకి తీసుకొస్తున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీకి వచ్చిన పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాకిస్థాన్ గత రెండు రోజులుగా డ్రోన్ ఎటాక్స్ చేస్తోందని.. ఆ డ్రోన్స్ అన్నీ తమ యూనివర్సిటీపై నుంచి వెళ్లాయన్నారు.
డ్రోన్స్‌ను చూసిన యూనివర్సిటీ యాజమానం మమ్మల్ని వెంటనే వెళ్లిపోవాలని చెప్పారన్నారు. అమృత్‌సర్, జలంధర్ లాంటి సున్నితమైన ప్రదేశాల్లో బ్లాక్ ఔట్, రెడ్ అలర్ట్‌లు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో మేము చాలా ఇబ్బంది పడ్డామన్నారు. డ్రోన్స్ వల్ల ఎలాంటి విధ్వంసం జరగలేదని.. పాకిస్థాన్ వేసిన డ్రోన్లను భారత్ అడ్డుకుందని విద్యార్థులు చెప్పారు. అయితే పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలోనే దాదాపు 2వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం. వారందరినీ కూడా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి.
Pakistan And China: పాక్ విష ప్రచారం.. చైనా వైరల్.. కొట్టిపారేసిన భారత్..
కాగా.. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులను త్వరితగతిన వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఇక ఇండియా పాక్ వార్ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. జమ్ము కాశ్మీర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు కాల్స్ చేస్తున్న పరిస్థితి. పంజాబ్, జమ్ములో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. ఇక జమ్ము, పంజాబ్ రాష్ట్రాల్లో అర్ధరాత్రి వేళల్లో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుండగా.. ఉదయం సేఫ్ జోన్‌గానే ఉంటోంది. అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులను బస్సుల్లో, ఇతర వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కాలేజీ యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులను ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్లకు తరలిస్తుండగా.. మరికొంతమందిని నేరుగా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్టూడెంట్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్స్: గౌరవ్ ఉప్పల్
తెలంగాణ భవన్‌లో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 2500 మందికిపైగా తెలంగాణ వారు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో అకామిడేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. తిరిగి వారిని స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..
Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..
Read Latest AP News And Telugu News
Read Latest Telangana News And Telugu News