Share News

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా డ్రామా..!

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:35 PM

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ నేతలు షాక్ అవుతుంటే.. టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. తాజాగా చింతకాయల విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం..

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా డ్రామా..!
Vijayasai Reddy

అనకాపల్లి, జనవరి 25: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయసాయి నిర్ణయంపై రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పందిస్తున్నారు. వైసీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే..కూటమికి చెందిన నాయకులు మాత్రం విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందినకాడికి దోచుకుని.. ఇప్పుడు అస్త్ర సన్యాసం అని డైలాగ్స్ వదిలితే.. తాము వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడిన విజయసాయిరెడ్డిని విడిచిపెట్టేది లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.


అంతా డ్రామా..

ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామాపై సంచలన కామెంట్స్ చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామా పేరుతో డ్రామాలాడుతున్నారంటూ విమర్శించారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి చేసిన అరాచకాలపై తానే ఫిర్యాదు చేస్తానని అన్నారు. విజయసాయి వల్ల ఆర్థికంగా గానీ.. మానసికంగా గానీ.. ఇబ్బందులకు గురైతే నేరుగా ఫిర్యాదు చేయాలంటూ బాధితులకు విజయ్ పిలుపునిచ్చారు. రాజీనామా పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నాడంటూ విజయసాయిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన.


వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు సృష్టించి నాశనం చేశారని విజయ్ ఆరోపించారు. కాల్చేసి.. బూడిద చేసి నవ్వుకునే శాడిస్ట్ ఈ విజయసాయి రెడ్డి అంటూ తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. జగన్, విజయసాయి రెడ్డి డ్రామాలో భాగమే ఈ రాజీనామా అంశం అని టీడీపీ నేత విజయ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో డబ్బులు దోచేసి, వనరులు నాశనం చేసి, నాయకులను ఇబ్బందులకు గురి చేశారని.. అలాంటి విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. షర్మిల పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఎవరు బాధపడలేదని.. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే.. ఏదో జరిగిపోయింది అన్నట్టు డ్రామాలకు తెర తీశారు ఆగ్రహం వ్యక్తం చేశారాయన.


Also Read:

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 25 , 2025 | 03:35 PM