Share News

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:01 PM

తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

- గుంతకల్లు మీదుగా వెలంకనికి ప్రత్యేక రైలు

గుంతకల్లు(అనంతపురం): తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (09094) వెలంకనిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా టెర్మిన్‌సకు చేరుకుటుందన్నారు.


pandu2.2.jpg

ఈ ప్రత్యేక రైలు బోరివాలి, వసాయ్‌ రోడ్‌, పన్వేల్‌, లోనావాలా, పూనా, డౌండ్‌, షోలాపూర్‌, కలబురగి, వాడి, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్‌, ఆ దోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట(Kadapa, Rajampet), రేణిగుంట, కాట్పాడి, వెల్లూర్‌ కంటోన్మెంటు, తిరువన్నమలై, విల్లుపురం, మయిలదుతురై స్టేషన్ల మీదుగా నాగపట్నం చేరుకుంటుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 05 , 2025 | 01:01 PM