Share News

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:10 AM

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు. ఆయా రోజుల్లో సికింద్రాబాదులో రాత్రి 10-10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్‌కు చేరుకుంటుందన్నారు.


pandu1.2.jpg

దీని తిరుగు ప్రయాణపు రైలు (07034) ఈనెల 9 నుంచి 30వ తేదీ వరకూ బుధ, శనివారాలలో నడుస్తుందన్నారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5-20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాదుకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌(Lingampalli, Vikarabad), తాండూరు, సేడం, యాదగిరి, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్‌, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యల్హంక, బెంగళూరు కంటోన్మెంటు, కేఎస్ఆర్‌ బెంగళూరు, కనిగెరి, మండ్య స్టేషన్ల మీదుగా మైసూరుకు చేరుతుందన్నారు.


pandu1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 12:36 PM