Kollu Ravindra: ఇలా చేస్తే మీ పార్టీ సమాధే.. జగన్‌పై మంత్రి కొల్లు ఫైర్
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:10 PM
దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.
ప్రకాశం, డిసెంబర్ 30: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడం , ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడమే అతని విధానమన్నారు. తన విలాసవంతమైన నివాసం కోసం రిషికొండలో రూ.400 కోట్ల ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని మండిపడ్డారు.
రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నాడు అంటే ఇలాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు. యోగా అనేది మన సనాతనమైన ఆస్తి అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014 నుంచి ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారని అన్నారు. వైజాగ్‌లో నిర్వహించిన యోగా డే ఖర్చు రూ.18 కోట్లు అని.. దానిని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తే, అవగాహన లేని జగన్ దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. అతనికి ప్రజలే తగిన తీర్పునిచ్చారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్‌ను మరలా రివైజ్ చేస్తున్నామని.... లాభాలలో నడుస్తోందని అన్నారు. అభివృద్ధి చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా జగన్ ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ సమాధిగా మారి పోతుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి
దేశంలోనే చంద్రబాబుది ప్రత్యేక స్థానం: ఎంపీ కేశినేని
Read Latest AP News And Telugu News