Share News

Home Minister Anitha: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా.. నష్టమేమీ లేదు..

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:33 PM

ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెటో, బిస్కెటో కాదని తెలిపారు.

Home Minister Anitha: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా.. నష్టమేమీ లేదు..
Home Minister Anitha

ప్రకాశం: అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా.. అని ఆ కల నెరవేరకుండా.. వైసీపీ ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోమ్ మినిస్టర్ అనిత ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదికని సూచించారు. జగన్‌‌కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని హితవు పలికారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని ఆమె డిమాండ్ చేశారు.


ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని అనిత ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెటో, బిస్కెటో కాదని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబుని అవమానిస్తే ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చి పోరాటం చేశారని ధీమా వ్యక్తం చేశారు.


జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని హోమ్ మంత్రి అనిత డిమాండ్ చేశారు. జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగదని తెలిపారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్తే నష్టమేమీ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌‌పై విచారణ జరుగుతుందని.. విచారణ పూర్తయిన తర్వాత లిక్కర్ స్కామ్‌‌పై మాట్లాడుతామని అనిత వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Updated Date - Sep 21 , 2025 | 01:45 PM