Share News

Tirumala: ఔటర్‌ రింగురోడ్డు టూ పాపవినాశనం..

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:14 PM

తిరుమల(Tirumala)లో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు రూ.40 కోట్లతో ఔటర్‌రింగు రోడ్డు నుంచి పాపవినాశనంకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి టీటీడీ(TTD) పూనుకుంది.

Tirumala: ఔటర్‌ రింగురోడ్డు టూ పాపవినాశనం..

- రూ.40కోట్లతో నాలుగు లేన్ల రహదారి

తిరుమల: తిరుమల(Tirumala)లో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు రూ.40 కోట్లతో ఔటర్‌రింగు రోడ్డు నుంచి పాపవినాశనంకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి టీటీడీ(TTD) పూనుకుంది. పాపవినాశనం తీర్థం, ఆకాశగంగ, జపాలి ఆంజనేయస్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాలకు వెళ్లాలంటే నందకం సర్కెల్‌ లేదా అక్టోపప్‌ భవనం ముందు నుంచి గోగర్భం డ్యాం మీదుగా వెళ్లాలి. గోగర్భం డ్యాం నుంచి పాపవినాశనం వరకు రెండులైన్ల రోడ్డు మాత్రమే ఉండటంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశేష పర్వదనాలు, వారాంతాల్లో సర్వదర్శన క్యూలైన్‌ అక్టోపస్‌ సర్కిల్‌ దాకా వ్యాపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలతో సమస్యలు వస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా నాలుగు లేన్ల రహదారిని ప్రతిపాదించారు.

ఈ వార్తను కూడా చదవండి: High Court: కులం.. అభివృద్ధికి ఆటంకం


తొలి దశలో..

తొలిదశలో వాహనాలు గోగర్భం డ్యాం మీదుగా వెళ్లే అవసరం లేకుండా ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి క్షేత్రపాలకుని ఆలయం మీదుగా మఠాలు, డంపింగ్‌యార్డు, నేపాలి చెక్‌పోస్టుకు చేరుకునేలా రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి మఠాల వరకు పాచికాల్వ ఉండటంతో వంతెన నిర్మించనున్నారు.


రెండో దశలో..

నేపాలి చెక్‌పోస్టు నుంచి ఆకాశగంగ వరకు ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను తొలగించి సర్వే చేస్తున్నారు. ఆకాశగంగ నుంచి అటవీ భూములు కావడంతో అనుమతులు కోరారు.

nani5.2.jpg


ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 12:14 PM