Share News

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:57 AM

నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
Road Accident in Andhra Pradesh

నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై (Road Accident) ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఓక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తమ గమ్యస్థానాలకు వెళ్లాలనే తొందరలో వాహనాలను అతివేగంగా నడుపుతూ వాహనదారులు యాక్సిడెంట్‌లకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు మృతిచెందుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలంలో గల కాకర్లవారిపాలెంలో ట్రాన్స్మిట్ మిక్సర్ లారీ ఢీకొని ఒకరు మృతిచెందారు. తాటిపర్తివారిపాలెంకి చెందిన గుమ్మ వెంకటరామయ్య (54) బైక్‌పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించారు. కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడి ఆందోళనను విరమించారు.


తూర్పుగోదావరి జిల్లాలో..

మరో సంఘటనలో.. తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా సీతంపేట నుంచి విజయవాడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


చిత్తూరులో ముగ్గురు మృతి..

మరో సంఘటనలో.. కర్ణాటక హోస్కోట దగ్గర రాత్రి మూడు గంటల ప్రాంతంలో లారీ చిత్తూరు ఆర్టీసీ డిపోనకు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా... 16 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి, కేశవరెడ్డి(44), తులసి(21), ప్రణతి(4) ఉన్నారు. క్షతగ్రాతులను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారు చిత్తూరుకి చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మృతిచెందడంతో ఆయా కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


చిత్తూరు ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

mandipalli-Ramprasad.jpg

కర్ణాటక హోస్కోట వద్ద ఘోర రోడ్డు జరిగింది. ఈ ప్రమాదంలో ఓ లారీ, రెండు చిత్తూరు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదంలో చిత్తూరుకు చెందిన వారి మృతి బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాద పరిస్థితిపై అధికారుల నుంచి మంత్రి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని చెప్పారు. బాధితులకు తక్షణ వైద్యం సహాయం కల్పించాలని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇద్దరి ప్రాణం తీసిన విష వాయువు

జూలై 15 నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 10:57 AM