Nellore: నీటమునిగి పలువురు మృతి..
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:23 PM
మరో ఘటన బీమిలీ పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్‌లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
నెల్లూరు: ఏపీలోని పలు ప్రాంతాల్లో నీటమునిగి పలువురు వ్యక్తులు మృతిచెందారు. కావలి మండలం తుమ్మలపెంట బీచ్‌లో ఐలా శివకృష్ణ (21), వెయ్యాల విష్ణు(19) అనే మత్స్యకార యువకులు స్నేహితులందరితో కలిసి బోటులో షికారుకు వెళ్లారు. బోటులో షికారు చేస్తున్న సమయంలో పెద్ద అల రావడంతో బోటు బోల్తా పడింది. దీంతో బోటులో ఉన్న శివకృష్ణ, విష్ణు నీటమునిగి మృతిచెందగా.. మిగిలిన యువకులు పాణాలతో బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో ఘటన భీమిలి పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్‌లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ.. ఆసుపత్రిలో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని గొల్లలపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం