Sajjala Ramakrishna Reddy: రాజధానిపై మాటమార్చిన సజ్జల రామకృష్ణారెడ్డి..
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:18 PM
రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై మాట మార్చిన సజ్జల మడెం తిప్పారు. రాజధాని ఏర్పాటుకు విజయవాడ- గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు సజ్జల. మచిలీపట్నం వరకు మెగా సిటీ అవుతుందని పేర్కొన్నారు. అమరావతిలో ఉన్న భవనాలు చాలు.. కొత్తవి అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని సూచించారు.
వైసీపీ హయాంలో అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారంటూ మాటమార్చారు సజ్జల. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు అనుకున్నామని సజ్జల వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు