Nellore: ABN ఎఫెక్ట్.. కుట్రలు చేసిన వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయారుగా..
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:12 PM
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నెల్లూరు: కావలి మండలం తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకం వివాదానికి తెరపడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో వైసీపీ నేతలే శిలాఫలకాన్ని కూల్చివేసి కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తేల్చేశారు. శిలాఫలకం కూల్చివేత ఘటనపై ABNలో కథనం ప్రచురించబడింది. ఆ కథనానికి స్పందించిన పోలీసు అధికారులు నిజాలను నిగ్గు తేల్చారు.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ.. వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఏడుగురు వైసీపీ నేతలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు.
పోలీసుల విచారణలో శిలాఫలకాన్ని ధ్వంసం చేసింది వైసీపీ నేతలుగా తేలిందని డీఎస్పీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. వైసీపీ నేతలు పామంజి యానాదయ్య, కోడూరు జక్కరయ్య, కోడూరు ప్రేమ్ సాగర్, వాయిల తిరుపతి, కుమారి రాజు, కుమ్మరి శ్రీను, కొల్లు ఏడుకొండలను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిపై 324(4), 61(2), 196(1) రెడ్‌విత్ 3(5), BMS సెక్షన్ 3PDPP సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
తుమ్మలపెంటలో పామంజి యానాదయ్య 2021లో రాజు, తిరుపతి, సుకుమార్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. రోడ్డుకి, ఆ లేఅవుట్‌కి మధ్యనున్న శిలాఫలకం తొలగించి, ఆ భూమిని లే అవుట్‌లో కలుపుతామని కొనుగోలుదారులకి హామీ ఇచ్చారు. దీంతో కొనుగోలుదారుల ఒత్తిడితో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేశారు. చివరికి పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటపడ్డాయి. నిజాలు ఎప్పటికీ దాగి ఉండవన్న వాస్తవం ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం