Minister Anam Ramanarayana Reddy: నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు...
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:36 PM
నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు.
నెల్లూరు: గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రూ.84 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సముద్రంలోకి పోయే వృథా జలాలపై కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు..
నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే.. రాయలసీమ ప్రాంతంలో రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక, హంద్రీ-నీవా ప్రాజెక్టుని పక్కన పడేస్తే, కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. చివరి వరకు నీటిని అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు ఆయా ప్రదేశాలకు సందర్శించనున్నారని పేర్కొన్నారు. సోమశిల నుంచి 18750 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 TMCల నీటిని నిల్వచేస్తామని ఆయన చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం 12వేల క్యూసెక్కుల నుంచి 24 వేలకి పెంచుతామని చెప్పిందని మంత్రి ఆనం గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ ఆలోచన లేకుండా కమిషన్ల కోసం టెండర్లు పిలిచారని ఆరోపించారు. సోమశిల హైలెవల్ కెనాల్ కోసం అవసరమైన భూసేకరణ కోసం సీఎం చంద్రబాబు నిధులిచ్చారని తెలిపారు. జిల్లాలో 40 పంవాయతీ భవనాల నిర్మాణానికి రూ.12.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్ల కోసం రూ.50 కోట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులన్ని మళ్లించిందని విమర్శించారు. ఇప్పుడు కూడా తాము నిధులు ఇస్తామంటే, ఒక మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసి రావడం లేదని ఆనం మండిపడ్డారు.
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!