Tomato Falling Prices: భారీగా పతనమైన టమాటా ధర.. ధర్నాకు దిగిన రైతులు
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:27 PM
పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు రైతున్నకు లేకపోవడం, మార్కెట్‌లో దళారీలు చెప్పిన ధరకే అమ్మాల్సి రావడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు.
కర్నూలు: పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్కెట్‌లో కిలో టామాటా రూపాయి ధర పలుకుతుండటంతో.. రైతులు లబోదిబో అంటున్నారు. ధర లేకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోశారు అన్నదాతలు. అనంతరం టామాటా రైతులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రాలయం-బెంగళూరు రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు రైతున్నకు లేకపోవడంతో మార్కెట్‌లో దళారీలు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదు. కూరగాయల సాగు కలిసొస్తుందేమోనన్న ఆశతో సాగు చేసిన రైతులు.. టమాటా కోతకు వచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దళారులను, ధరలను నియంత్రణ చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు