TDP MP Signature Forgery: టీడీపీ ఎంపీ సంతకం ఫోర్జరీ.. పోలీసుల అదుపులో నిందితుడు
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:30 PM
టీటీడీ నకిలీ లేఖను సృష్టించి.. ఆ లేఖపై టీడీపీ ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఓ కేటుగాడు. ఆ లేఖను మరో వ్యక్తికి విక్రయించాడు. ఈ లేఖను తిరుమలలో టీటీడీ అధికారులు గుర్తించారు.
నంద్యాల, ఆగస్టు 14: టీటీడీ పేరిట లేఖను సృష్టించి.. దానిపై టీడీపీ ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శనానికి సంబంధించిన నకిలీ లేఖను వేంకటేశ్వర్లు అనే వ్యక్తి తయారు చేశాడు. దానిపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు కేటుగాడు. అనంతరం ఆ లేఖను రవితేజ అనే వ్యక్తికి విక్రయించాడు. ఆ లేఖను తీసుకుని తిరుమల దర్శనానికి రవితేజతోపాటు అతడి కుటుంబం వెళ్లింది. ఆ క్రమంలో జేఈవో ఆపీసులో దర్శనం కోసం సదరు లేఖను వారు అందజేశారు.
లేఖ కొంచెం తేడాగా ఉండడంతో అనుమానం వచ్చిన టీటీడీ అధికారులు వెంటనే టీడీపీ ఎంపీ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీశారు. తాము ఎవరికీ ఏ లేఖ ఇవ్వలేదంటూ ఎంపీ శబరి కార్యాలయం.. టీటీడీ అధికారులకు స్పష్టం చేసింది. దీంతో రవితేజను టీటీడీ అధికారులు నిలదీశారు. దాంతో తాను వేంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి ఈ లేఖను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కార్యాలయానికి తెలియజేశారు.
ఇంతలో ఎంపీ శబరి అనుచరులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం టీటీడీ నకిలీ లేఖ తయారు చేసిన వేంకటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. వేంకటశ్వర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా వేంకటేశ్వర్లను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ జ్యూస్ తాగితే.. ఇన్ని లాభాలా..
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. పోరాడితే అరెస్టులా..!
For More AndhraPradesh News And Telugu News