ఈ జ్యూస్‌ తాగితే.. ఇన్ని లాభాలా..

మోసాంబి (బత్తాయి) పండు ఆరోగ్యానికి మంచిది. దీనిని రసంగా లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవచ్చు. 

ఇందులో విటమిన్ సి, పాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ పండ్ల రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా మీరు మీ శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.

మోసాంబితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చర్మం ఆరోగ్యంగా.. మెరిసేలా చేస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

ఈ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.

మోసాంబి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు అందుకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షిస్తుంది.

ఈ రసాన్ని క్రమం తప్పకుంటే.. అజీర్ణం, ప్రేగు కదలికలు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఈ రసంలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యంలో వచ్చే ముడతలను తగ్గించడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఈ రసంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల.. వాపు నుంచి రక్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను సైతం తగ్గిస్తుంది.