ప్రెగ్నెన్సీ సమయంలో టీ తాగితే ఏమవుతుందో తెలుసా..

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

శారీరక శ్రమ నుంచి జీవనశైలి వరకు రోజువారీ కార్యకలాపాలలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదకరం.

మరి ప్రెగ్నెన్సీ సమయంలో టీ, కాఫీలు తాగొచ్చా? తాగితే ఎంత మొత్తం సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కొంతమంది గర్భణీగా ఉన్న సమయంలో ఇష్టమన్న కారణంతో టీ తెగ తాగేస్తుంటారు..

టీ, కాఫీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ టీ తాగకూడదని హెచ్చరిస్తున్నారు.

టీ అధికంగా తీసుకుంటే కడుపులో బిడ్డ పెరుగుదల మందగించడం, నెలలు నిండకముందే ప్రసవం, గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రతీ గర్భిణీ స్త్రీ శరీర స్థితి భిన్నంగా ఉంటుంది.. కాబట్టి డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్