వర్షాకాలంలో బ్రోకలితో కలిగే  ఊహించని లాభాలివే..

చూసేందుకు అచ్చం కాలిఫ్ల‌వ‌ర్ లా ఉండే దీనిపేరు బ్రోక‌లీ. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

చూడటానికి చెట్టు లాగే ఉంటుంది కానీ ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది. ఇందులో అనేక పోష‌కాలు దాగి వున్నాయి

బ్రోక‌లీలో కెరోటినాయిడ్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచింది. ఇది కంటి చూపు మెరుగు ప‌డేలా చేస్తుంది.

ఇది బరువు తగ్గడానికి, షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ లో ఉండటానికి సహాపడుతుంది.

   వర్షాకాలంలో బ్రోకలీ తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట.

 బ్రోకలీ రక్తపోటు, గుండె సమస్యలు ఉన్న వారికి కూడా దివ్యఔషధంగా పని చేస్తుందంట.

 బ్రోక‌లీని తిన‌డం వ‌ల్ల శరీరానికి క్యాల్షియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది దంతాల‌ను, ఎముక‌లు దృఢంగా ఉండేలా చేస్తుంది.

బ్రోక‌లీలో సల్ఫోరాఫెన్ ఉంటడం వలన ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందంట.

వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.