KTR Fire: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. పోరాడితే అరెస్టులా..!
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:19 PM
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌లు రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శమన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 14: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సహా ఇతర నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు.
రైతుల చేతులకు సంకెళ్లు వేసి.. వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని కేటీఆర్ అభివర్ణించారు. పోడు రైతులను వేధించడం ఆపి.. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
Read Latest Telangana News and National News