PM Modi Srisailam Temple: శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:58 PM
ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
నంద్యాల: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. మొదటగా.. ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు వచ్చారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు.
ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు తర్వాత నందీశ్వర దర్శనం చేసుకున్నారు. అర్చకులు అందించిన స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పూజలో భాగంగా.. ప్రధాన మంత్రి మోదీకి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలు ఆలయ పూజారులు అందించారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి