Share News

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:11 PM

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి
PM Modi Kurnool Visit

కర్నూలు, అక్టోబర్ 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రేపు (గురువారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఈరోజు (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. సహచర మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి , కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు. వేదిక, భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలపై చర్చించారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి శాఖ అధికారులు, కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు.


ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. ప్రధాని పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాల ద్వారమన్నారు. ప్రజల్లో ఉత్సాహం నింపి సభను చారిత్రాత్మకంగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశా నిర్దేశం అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


కాగా.. రేపు ప్రధాని మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సుండిపెంట వెళ్లనున్నారు ప్రధాని. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11.15 గంటలకు శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను మోదీ దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.10 శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సుండిపెంటకు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ లో నేరుగా నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ హెలీప్యాడ్ కు వస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాన మంత్రి బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4:05 గంటలకు కార్యక్రమం ముగించుకుని కర్నూలు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.


ఇవి కూడా చదవండి..

డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..

బుల్డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనీ చేయొచ్చు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 05:39 PM