Black Magic: ఏపీలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 07:47 AM
నంద్యాల జిల్లాలోని మహానంది సమీపంలోని గరుడ నందీశ్వరుని ఆలయానికి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్షుద్ర పూజలు జరిగిన స్థలంలో స్త్రీ బట్టలు, నిమ్మకాయలు,పూజా వస్తువులు కనిపించాయి.

నంద్యాల: మహానంది సమీపంలోని గరుడ నందీశ్వరుని ఆలయానికి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు (Black Magic) నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్షుద్ర పూజలు జరిగిన స్థలంలో స్త్రీ బట్టలు, నిమ్మకాయలు, పూజా వస్తువులు కనిపించాయి. క్షుద్ర పూజల విషయం తెలిసి ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ సంఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు ఆలయ పరిసరాల్లో మరింత భద్రతను పెంచారు. ప్రత్యేక నిఘా బృందాలను నియమించి 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణానికి వచ్చే దారుల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడితే తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్
For More AP News and Telugu News