DIG Koya Praveen: కర్నూలు బస్సు ప్రమాదం.. DIG కోయ ప్రవీణ్ కీలక కామెంట్స్
ABN , Publish Date - Oct 25 , 2025 | 07:57 PM
కర్నూలులో కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది చనిపోయారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.. బస్సు ప్రమాద ఘటనపై కీలక విషయాలను వెల్లడించారు.
కర్నూలు, అక్టోబర్ 25: చిన్నటేకూరు వద్ద వి.కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు(Kurnool bus accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది చనిపోయారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్.. బస్సు ప్రమాద ఘటనపై కీలక విషయాలను వెల్లడించారు.
డీఐజీ ప్రవీణ్(DIG Koya Praveen) మాట్లాడుతూ...' కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నిన్న(శుక్రవారం) ప్రెస్ మీట్ లో ప్రమాదంపై వివరాలు తెలిపాము. రాత్రి సీసీ పుటేజ్ లభించాక శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామితో మాట్లాడాము. ఎర్రిస్వామి, బస్సు డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ప్రమాదంపై క్లారిటీ వచ్చింది. కావేరి ట్రావెల్(Kaveri Travels accident) రాక ముందే శివశంకర్ బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. శివ మృతిచెందగా.. ఎర్రిస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ ను ఎర్రిస్వామి పక్కకు జరిపాడు. బైక్ ను కూడా పక్కకు తీసుకెళ్లాలని భావించాడు. ఈ లోపే కావేరీ ట్రావెల్ బస్సు వచ్చింది. బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోయి.. ముందుకు లాక్కొని పోయింది.
శబ్దం వచ్చి బ్రేక్ వేసే లోపే బస్సులో భారీగా మంటలు(aught fire after a collision) చెలరేగాయి. బైకర్స్ మద్యం సేవించలేదు. ఎర్రిస్వామి హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పని చేస్తున్నాడు. మృతుడు శివశంకర్ టైల్స్ వర్క్స్ చేస్తాడు. ఇద్దరూ కలిసి డాబాలో భోజనం చేశారు. ఎర్రిస్వామిది తుగ్గలి మండలంలోని ఓ గ్రామం. ఊరికి వెళ్తానంటే ఈ టైంలో బస్సులు ఉండవు. డోన్ లో డ్రాప్ చేస్తానని శివశంకర్ చెప్పడంతో ఇద్దరూ బైక్ పై బయలుదేరారు. అంతకంటే ముందు పెట్రోల్ బంకులు పెట్రోల్ పోపించుకున్నారు. దానికి సంబంధించిన సీసీ పుటేజీలో ఇద్దరూ ఉన్నారు. అలానే బస్సులో రిజర్వేషన్ చేసుకున్న వారి వివరాలన్నీ వచ్చాయి.
ఓ వ్యక్తి రిజర్వేషన్ చేయించుకోకుండా బెంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్ లోని ఆరాంఘర్ ప్రాంతంలో బస్సు ఎక్కాడు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. రాజేంద్రనగర్ పోలీసు అధికారితో మా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఆ వ్యక్తి సీసీ ఫుటేజీ ఫోటోల కోసం ట్రై చేస్తున్నాం. బస్సుకు సంబంధించిన రిపోర్ట్ ఆర్టీఏ అధికారులు (Kurnool accident investigation) ఇవ్వనున్నారు. బస్సు యాజమాన్యం నిర్లక్ష్యంపై ఫోరోనిక్స్ లేదా ఎంవీఐ(మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్) (MVI report)నివేదిక ఇస్తే దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాము' అని డీఐజీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
Read Latest AP News And Telugu News