Share News

Coalition Leaders Meeting: వారి విమర్శలను గట్టిగా తిప్పికొడతాం: కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Oct 25 , 2025 | 03:21 PM

ప్రభుత్వం గత సంవత్సన్నర కాలంగా చేస్తున్న అభివృద్ధిపై రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమైనట్లు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ గతంలో చేసిన అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామన్నారు.

Coalition Leaders Meeting: వారి విమర్శలను గట్టిగా తిప్పికొడతాం: కొల్లు రవీంద్ర
Coalition Leaders Meeting

అమరావతి, అక్టోబర్ 25: ఉమ్మడి కృష్ణ జిల్లా కూటమి నేతల సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గాల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలవాలని నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రులు పేర్ని నాని , జోగి రమేష్‌ల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని... ఇక నుంచి వైసీపీ నేతల విమర్శలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలని కూటమి నేతలు నిర్ణయించారు.


సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం గత సంవత్సన్నర కాలంగా చేస్తున్న అభివృద్ధిపై రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమైనట్లు వెల్లడించారు. వైసీపీ గతంలో చేసిన అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి అసలు డేటా సెంటర్ అంటే ఏమిటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్‌కు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదని.. పనికి రాని బ్రాండ్‌లు అమ్మిన ఘనత జగన్ దే అంటూ దుయ్యబట్టారు. ఏపీ సురక్ష యాప్‌ను ఇప్పటి వరకు రెండున్నర లక్షల మంది వాడుతున్నారని తెలిపారు. ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు.


తిరువూరు ఘటనపై స్పందిస్తూ.. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు రావడం సహజమన్నారు. అయినా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నిన్న కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియా పర్యటనపై లోకేష్ ఆసక్తికర ట్వీట్

ప్రవాసాంధ్రులకు ప్రత్యేక పథకం.. దుబాయ్‌లో ప్రారంభించిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 07:30 PM