Share News

Pravasa Andhra Bharosa: ప్రవాసాంధ్రులకు ప్రత్యేక పథకం.. దుబాయ్‌లో ప్రారంభించిన సీఎం

ABN , Publish Date - Oct 25 , 2025 | 02:52 PM

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.

Pravasa Andhra Bharosa: ప్రవాసాంధ్రులకు ప్రత్యేక పథకం.. దుబాయ్‌లో ప్రారంభించిన సీఎం
Pravasa Andhra Bharosa

అమరావతి, అక్టోబర్ 25: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ప్రవాసాంధ్ర భరోసా’ (Pravasa Andhra Bharosa) పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దుబాయ్‌లో ప్రారంభించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం,  అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందించనుంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు,  విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.


ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాల కోసం 24/7 అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్ 8632340678, వాట్సాప్ నెంబర్ 8500027678లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకే వీలు కల్పించింది సర్కార్.


ఇవి కూడా చదవండి..

కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

ఆస్ట్రేలియా పర్యటనపై లోకేష్ ఆసక్తికర ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 04:14 PM