Wines license cancel: కల్తీ మద్యం కేసులో అధికారుల దూకుడు.. వైన్స్ లైసెన్స్ రద్దు
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:27 AM
కల్తీ మద్యం కేసులో గతంలో ఇబ్రహీంపట్నంలోని మద్యం తయారీ యూనిట్‌ను అధికారులు తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్ షాపులో కనిపించాయి.
విజయవాడ: కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ మేరకు భవానీపురంలోని శ్రీనివాస వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురానికి నకిలీ మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా కల్తీ మద్యం విక్రయంపై బార్ యజమానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం యజమానిని విచారించినట్లు వివరించారు. ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కల్తీ మద్యం కేసులో గతంలో ఇబ్రహీంపట్నంలోని మద్యం తయారీ యూనిట్‌ను అధికారులు తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్ షాపులో కనిపించాయి. అయితే విజయవాడ బార్ యజమాని, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు భాగస్వామ్యంతో నగరంలో ఉన్న శ్రీనివాస వైన్స్‌లో నకిలీ మద్యం విక్రయించినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఇవాళ(శుక్రవారం) వైన్స్ లైసెన్స్‌ను రద్దు చేశారు.
ఇటివల రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కల్తీ మద్యానికి చోటివ్వకుండా, దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ఠ చర్యలు చేపట్టింది. బెల్టు దుకాణాల విషయంలో కఠిన వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అలాగే అన్ని మద్యం షాపులపై అధికారులు నిఘా పెట్టారు.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్