Share News

Vangaveeti Radhakrishna: వంగవీటి రంగా ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:34 PM

వంగవీటి రంగా జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు.

Vangaveeti Radhakrishna: వంగవీటి రంగా  ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి
Vangaveeti Radhakrishna

విజయవాడ: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడ నగరంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రంగా జయంతి సందర్భంగా కృష్ణలంక రాణి గారి తోట, పటమట చిన్న వంతెన సెంటర్ వద్ద రంగా విగ్రహాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి రాధాకృష్ణ, ఇతర నేతలు నివాళులు అర్పించారు.


అనంతరం మీడియాతో వంగవీటి రాధాకృష్ణ మాట్లాడారు. వంగవీటి రంగా జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకి అండగా నిలబడ్డారని ఉద్ఘాటించారు. రంగా ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈరోజు వంగవీటి మోహనరంగా పేరుతో అన్నదానాలు, వస్త్రాలు, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపట్టడం గొప్ప‌ విషయమని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కాకాణికి మరో షాక్‌

శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ పురస్కారం

For More AP News and Telugu News

Updated Date - Jul 04 , 2025 | 12:40 PM