Rayavaram Blast: రాయవరం బాణసంచా పేలుడుపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:46 PM
రాయవరంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడికి కారణాలను అన్వేషించాలని ఆదేశాల్లో వెల్లడించింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని తెలిపింది.
అమరావతి, అక్టోబర్ 9: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా పేలుడుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గురువారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని నియమించింది. దర్యాప్తు కమిటీ సభ్యుడుగా ఐ.జి. ఆకే రవికృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాయవరంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడికి కారణాలను అన్వేషించాలని ఆదేశాల్లో వెల్లడించింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని తెలిపింది. ఈ తరహా ఘటనలు జరగకుండా నివారణ చర్యలు సిఫార్సు చేయాలని ఆదేశించింది. వారంలోగా అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. విచారణ కమిటీకి సహకరించాలని కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి
చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ
Read Latest AP News And Telugu News