Payyavula Keshav On RDT: త్వరలోనే ఆర్డీటీపై పాజిటివ్ వార్త: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:14 PM
జగన్ మోహన్ రెడ్డి చీప్ రాజకీయాలు మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ హితవుపలికారు. మెరుగైన సేవలు కోసమే పీపీపీ మోడల్ అని స్పష్టం చేవారు.
అనంతపురం, అక్టోబర్ 9: జీఎస్టీ తగ్గింపు ఫలాలు సామాన్యులకు చేరాలని జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం నాడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించామని తెలిపారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి రూ.18 వేలు నుంచి 20 వేలు ఆదా అవుతోందన్నారు. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారని మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై కేంద్రమంత్రి అమిత్ షా తో మాట్లాడారని.. పేదలకు మంచి చేస్తున్న ఆర్డీటీ గురించి త్వరలో మంచి వార్త వింటారని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి చీప్ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. మెరుగైన సేవలు కోసమే పీపీపీ మోడల్ అని స్పష్టం చేవారు. ప్రపంచం ఓ వైపు పోతుంటే జగన్.. ఏపీని వెనక్కి లాగాలని చూస్తున్నారని విమర్శించారు. ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపిరికట్టది ఓ దారి అన్న చందంగా జగన్ తీరు ఉందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
అంతుకు ముందు.. సూపర్ జీఎస్టీ సేవింగ్స్‌లో భాగంగా మెడికల్ షాపుల్లో ధరలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. మెడికల్ షాపుల్లో గతం కంటే తగ్గిన ధరలను మంత్రి కేశవ్ చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను ఎక్కడ ప్రైవేటీకరణ చేయడం లేదన్నారు. పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయడం కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రయత్నమన్నారు. చీప్ పాలిటిక్స్ చేయడం జగన్ మార్చుకోవాలని.. పీపీపీ మోడల్ అనేది సరైన నిర్ణయమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన అనేది సూపర్ జీఎస్టీ సేవింగ్స్‌లో భాగమని మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి
చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ
Read Latest AP News And Telugu News