Woman Employee On Train: రైలులో రెచ్చిపోయిన కామాంధుడు.. మహిళా ఉద్యోగిపై..
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:51 PM
అదే రైలులో చిత్తూరుకు చెందిన 45 ఏళ్ల శంకర్ కూడా ప్రయాణిస్తున్నాడు. అతడు వస్త్ర వ్యాపారం చేయడానికి ఈరోడ్ వెళుతున్నాడు. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటిన తర్వాత శంకర్ తన పాడు బుద్ధి బయటపెట్టాడు.
ఈ మధ్య కాలంలో రైళ్లలో ఆడవారిపై అకృత్యాలు అధికమైపోయాయి. కళ్లు మూసుకుపోయిన స్థితిలో కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో తప్పుగా ప్రవర్తిసున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి లోకల్ ట్రైన్‌లో యువతితో తప్పుగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి అతడికి సరైన విధంగా బుద్ధి చెప్పింది. తాజాగా, తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన మహిళకు రైలులో దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం రాత్రి కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరునుంచి ఈరోడ్‌కు బయలు దేరింది. రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం చేస్తూ ఉంది. అదే రైలులో చిత్తూరుకు చెందిన 45 ఏళ్ల శంకర్ కూడా ప్రయాణిస్తున్నాడు. అతడు వస్త్ర వ్యాపారం చేయడానికి ఈరోడ్ వెళుతున్నాడు. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటిన తర్వాత శంకర్ తన పాడు బుద్ధి బయటపెట్టాడు.
ఆ మహిళపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. షాక్‌కు గురైన మహిళ గట్టిగా కేకలు వేయటం మొదలెట్టింది. దీంతో తోటి ప్రయాణికులు అక్కడికి చేరుకుని శంకర్‌ను పట్టుకున్నారు. నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
హోటల్‌లో ఊహించని సంఘటన.. వెయిట్రెస్ సకాలంలో స్పందించటంతో..
పౌరులపై మిలటరీ బాంబు దాడి.. వెలుగులోకి భయానక దృశ్యాలు..