Military Attack Thadingyut Festival: పౌరులపై మిలటరీ బాంబు దాడి.. వెలుగులోకి భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:08 PM
2021లో మిలటరీ మయన్మార్ దేశాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. దీంతో మిలటరీకి వ్యతిరేకంగా కొంతమంది దేశ పౌరులు గ్రూపులుగా ఏర్పడి పోరాటం మొదలెట్టారు.
మయన్మార్ మిలటరీ తమ దేశ పౌరులపై బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది చనిపోగా.. 80 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ మయన్మార్‌లోని చౌంగ్ యూ పట్టణంలో మంగళవారం సాయంత్రం తాడింగ్యుత్ నిండు పున్నమి పండుగ జరిగింది. దాదాపు 100 మంది పైనే పౌరులు ఆ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మిలటరీ దారుణానికి పాల్పడింది. కార్యక్రమంలో ఉన్న ప్రజలపై బాంబు దాడులు చేసింది. దీంతో 40 మంది అక్కడికక్కడే చనిపోయారు.
మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిలటరీ తన దేశ పౌరులపై బాంబుల దాడి చేయడానికి కారణం ఏంటంటే.. 2021లో దేశాన్ని మిలటరీ తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. దీంతో మిలటరీకి వ్యతిరేకంగా కొంతమంది దేశ పౌరులు గ్రూపులుగా ఏర్పడి పోరాటం మొదలెట్టారు. గత కొన్నేళ్ల నుంచి ప్రజలు, మిలటరీ మధ్య గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పౌరులపై మిలటరీ బాంబు దాడులకు పాల్పడింది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రజల హాహాకారాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఓ వీడియోలో ఏముందంటే.. ఓ చోట పెద్దఎత్తున మంటలు ఎగిపడుతున్నాయి. చీకట్లో జనం అటు, ఇటు పరుగులు పెడుతున్నారు. భయపడిపోయిన జనం హాహాకారాలు చేస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడ ఏం జరుగుతోందో సరిగా కనిపించటం లేదు. కానీ, వాళ్ల అరుపులు వింటుంటే గుండె వేగంగా కొట్టుకుంటోంది’..‘ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రపంచ దేశాలు స్పందించాల్సిన అవసరం ఏంతైనా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అత్తతో ఎఫైర్ పెట్టుకున్న అల్లుడు.. భార్య అడ్డు చెప్పడంతో..
కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్..