Share News

Six Month Affair: అత్తతో ఎఫైర్ పెట్టుకున్న అల్లుడు.. భార్య అడ్డు చెప్పడంతో..

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:06 AM

కొన్ని రోజల ముందు వరకు ఈ ఎఫైర్ నాలుగు గోడల మధ్య ఉండేది. అయితే, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Six Month Affair: అత్తతో ఎఫైర్ పెట్టుకున్న అల్లుడు.. భార్య అడ్డు చెప్పడంతో..
Six Month Affair

ఓ యువకుడు అత్త( భార్య తల్లి)తో ఎఫైర్ పెట్టుకున్నాడు. 6 నెలల పాటు ఇద్దరూ గుట్టుగా వ్యవహారం నడిపారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. చివరకు ఆ యువకుడు భార్య ప్రాణాలు తీసేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కాస్‌గంజ్ జిల్లాలోని నగ్లా పర్సీ గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తికి శివాని అనే యువతితో కొన్ని నెలల క్రితం పెళ్లయింది. ప్రమోద్ ఎక్కువగా అత్తింట్లోనే ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే అత్తా, అల్లుడి మధ్య ఎఫైర్ మొదలైంది.


కొన్ని రోజల ముందు వరకు ఈ ఎఫైర్ నాలుగు గోడల మధ్య ఉండేది. అయితే, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బంధువులు, ఇంటి పక్క ఉండేవారికి కూడా విషయం తెలిసింది. భర్త తప్పు పని చేస్తున్నాడేమోనన్న అనుమానం శివానికి ముందే వచ్చింది. భర్తను చాలా సార్లు అడిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఫొటోలు బయటకు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య పరిస్థితి దారుణంగా తయారయింది.


రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరూ లేనపుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ప్రమోద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను కొట్టి చంపేశాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న శివానిని చూసి షాక్ అయ్యారు. ఆమె చనిపోయిందని గుర్తించాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. కంపెనీ యజమాని అరెస్ట్..

మెడికల్ కాలేజీ వాటర్ ట్యాంకులో కుళ్లిన స్థితిలో శవం..

Updated Date - Oct 09 , 2025 | 10:08 AM