Teen Waitress Performs Heimlich: హోటల్‌లో ఊహించని సంఘటన.. వెయిట్రెస్ సకాలంలో స్పందించటంతో..
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:25 PM
యువతి హాలోవీన్ డెకరేషన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న వ్యక్తిని చూసింది. ఇక, ఏమాత్రం ఆలోచించకుండా అతడి దగ్గరకు పరుగులు పెట్టింది. అతడి వీపు వెనకాలి నుంచి హైమ్‌లెక్ చేసింది.
ఓ యువతి చేసిన మంచి పని ఆమెను రియల్ హీరోను చేసింది. ఆమెపై జనం ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఆమెను జనం పొగడడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఓ వ్యక్తి ప్రాణాలను ఆమె కాపాడింది. అది కూడా ఎంతో వేగంగా, తెలివిగా ఆలోచించి అతడ్ని చావునుంచి బయటపడేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని లూసియానుకు చెందిన ఓ వ్యక్తి బుడాటన్ ఏసియన్ హోటల్‌కు వెళ్లాడు. ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి గొంతులో ఏదో ఇరుక్కుంది.
ఊపిరి ఆడక ఇబ్బంది పడసాగాడు. అదే సమయంలో అతడికి కొంత దూరంలో మాడిసన్ బ్రైడల్స్ అనే యువతి హాలోవీన్ డెకరేషన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న వ్యక్తిని చూసింది. ఇక, ఏమాత్రం ఆలోచించకుండా అతడి దగ్గరకు పరుగులు పెట్టింది. అతడి వీపు వెనకాలి నుంచి హైమ్‌లెక్ చేసింది. అతడి గొంతులో ఇరుక్కున్న అడ్డు తొలగిపోయింది. అతడు సాఫీగా ఊపిరి తీసుకోసాగాడు. మళ్లీ తినడానికి ఉపక్రమించాడు. మ్యాడీసన్ కూడా ఏమీ జరగనట్టు అక్కడినుంచి వెళ్లిపోయింది.
మ్యాడీసన్ ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజీల తాలూకా వీడియోను హోటల్ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో తెగ వైరల్ అయింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నువ్వు నిజమైన సూపర్ హీరోవు. అతడి ప్రాణాలు కాపాడావు’.. ‘నీ తెలివి తేటలకు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్‌కు సెల్యూట్. నువ్వు ఏ మాత్రం ఆలస్యం చేసి ఉన్నా అతడి ప్రాణాలు పోయేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాడీసన్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పౌరులపై మిలటరీ బాంబు దాడి.. వెలుగులోకి భయానక దృశ్యాలు..
జగన్‌పై దళిత సంఘాల ఆగ్రహం.. పర్యటన అడ్డుకుంటామంటూ..